పాడేరు ( జనస్వరం ) : చింతపల్లి జనసేనపార్టీ నాయకులు ఉల్లి సీతారామ్ చేస్తున్న గ్రామ పర్యటనలో భాగంగా లోతుగెడ్డ జంక్షన్ లో పర్యటించారు. స్థానిక ప్రజలు మురుగు నీటి కాలువ పర్యవేక్షణ లేక తీవ్ర దుర్గంధంతో ఇబ్బందిపడుతున్న విషయంపై సమీక్షించారు. ఈ సమస్యపై చుట్టూ పక్కన దుకాణాదారులతో సమావేశమై వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే గిరిజన పట్టభద్రులైన యువకులు, మేధోవర్గానికి చెందిన గిరిజన పెద్దలు, మున్సిపాలిటీ, పంచాయితిలు వారికి కేటాయించిన ఓటుశాతం తో ఎమ్మెల్సీ గా ఎన్నుకుంటే గెలిచిన విధాన సభ పరిషత్ మండలి ఎమ్మెల్సీ గారు మన ప్రాంతంలో గల మున్సిపాలిటీ పరిస్థితులపై సమీక్ష చెయ్యాలి. కానీ అవి జరగట్లేదు ఇప్పటికైనా రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులైన యువకులు ఇటువంటి పని దొంగలకు అధికారం ఇచ్చే ఆలోచనలు చెయ్యకూడదన్నారు? రోజు రోజుకి పచ్చని ఏజెన్సీ ప్రాంతం సరైన మునిసిపాలిటీ వ్యవస్థ లేక డంపింగ్ యార్డులుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే వర్ధమాన నగరాలుగా గిరిజన ప్రాంతంలో మధ్యస్థాయి పట్టణాలుగా, అరకు వ్యాలీ, పాడేరు, చింతపల్లి వంటి పట్టణాలు ఎదుగుతోందని ఇలాంటప్పుడు ఆయా పట్టణాలలో సరైన మురుగు నీటి కాలువల దుస్థితి అద్వాన్నంగా ఉన్నమాట జగమెరిగిన సత్యమన్నారు. పర్యాటక రంగంగా ఉన్న మన ప్రాంతంలో ఇటువంటి పరిశుభ్రత లేమి మంచిది కాదన్నారు. జనసేనపార్టీ చింతపల్లి నాయకులు ఈ విషయంపై యువతకి గిరిజన ప్రజలకు చైతన్యం చేస్తూ గ్రామాబాట పట్టారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల నాయకులు ఉల్లి సీతారామ్, వంతల రాజారావు, శేఖర్ వనబరంగి సాయిరామ్ పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com