Logo
Date of Publish : 10 May 2022, 2:27 pm
Editor : Sake Naresh

అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

       విజయనగరం ( జనస్వరం ) : పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సోమవారం నాడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబుపాలూరి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలెక్టర్ గారికి కలిసి అక్రమ ఇసుక మాఫియా గురించి మరియు JP Powers అనే సంస్థ చేస్తున్న అక్రమ ఇసుక తరలింపు గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో వెళ్లిన జనసేన నాయకులను అక్రమంగా 147, 353 సెక్షన్స్ మీద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్ గురించి తెలుసుకొని పార్వతీపురం జనసేన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జిల్లా నాయకులు, లీగల్ సెల్ టీం రావడం జరిగింది. అరెస్ట్ అయిన బాబు పాలూరు మరియు నాయకులతో మాట్లాడి అక్కడ జరిగిన విషయాలు అన్ని కనుక్కొని నేరుగా జిల్లా కలెక్టర్ గారిని మరియు SP గారిని కలిసి జరుగుతున్న ఇసుక అక్రమాలు గురించి సాక్ష్యాలతో కలెక్టర్ ముందు ఉంచడం జరిగింది. స్పందించిన కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి విచారణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com