
అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం పైనా గ్రామం దళితవాడలో వృద్ధుడకు ఎన్నో సంవత్సరాల నుంచి స్లాబు వేసుకోలేని పరిస్థితి ఉంది. ఆర్థిక స్తోమత సహకరించక పక్కనే చిన్న పాకలో ఉంటున్నాడు. ఈ విషయం పైనా గ్రామ జనసైనికులు నియోజకవర్గ ఇంచార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాస్ కు తెలియజేశారు. మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు వీరస్వామి గారు, నాగు గారు, మండల నాయకులు, మండల జనసైనికులు సహకారంతో ఆ వృద్ధుడికి రేకుల షెడ్డు వేయడం జరిగినది. లోపల గది కూడా పని పూర్తి చేసి త్వరలోనే ఆ ఇంట్లో గృహ ప్రవేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తామన్నారు. తన జీవితం ఉన్నంతకాలం తన కట్టుకున్న ఇల్లులో నివాసం ఉండాలనే ఆ వృద్ధుడు కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.