పత్తికొండ ( జనస్వరం ) : పత్తికొండకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ గారిని ముందస్తుగా ఉదయం 5 గంటలకే అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు పత్తికొండ నియోజకవర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కావున ఇచ్చిన హామీలు మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని శాంతియుతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఉదయం 5 గంటలకు జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ ఇంటి దగ్గరికి క్రైమ్ బ్రాంచ్ సిఐలు శ్రీరామ్, నాగ శేఖర్ మరియు పత్తికొండ రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, 6 మంది పోలీసులు, బలవంతంగా సిజి రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతని నొక్కేయాలి అనుకోవడం ఆ ప్రజాస్వామ్యంగా తెలియజేస్తున్నానని అన్నారు. సూర్యుని అరిచేతతో ఎవరైనా ఆపగలరా, అలాగే ప్రజాస్వామ్యంలో పోరాడే మాలాంటి వ్యక్తులను ఎవరు ఆపలేరని తెలియజేశారు. ఇలాగే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ముందు పెట్టుకొని మాలాంటి నాయకులు భయపడితే భయపడతారు అనుకుంటున్నారా, ఈరోజు నుంచి మా పత్తికొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు గురించి పాంప్లెట్లు కొట్టించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వ్యక్తికి తెలియజేస్తామని తెలియజేశారు.