శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు స్థానిక పాంచాయితీ పరిధిలో ఉన్న ప్రభుత్వ చెరువు(కంకర)లో అధికార వైకాపాకు చెందిన నాయకులు చేస్తున్న అక్రమ నిర్మాణాలపై జనసేన పార్టీ నేతలు ఆదివారం నాడు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అశోక్, జయరాజ్‌లు మాట్లాడుతూ, అధికార పార్టీనేతల అక్రమాలకు అడ్డుకట్టవేసే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తూరు పరిధిలోని సర్వే. నెం. 289లో ఉన్న ఒక ఎకరా ఏబై ఎనిమిది సెంట్ల ప్రభుత్వ చెరువులో ఎటువంటి అక్రమణలు చేసినా, అటువంటి వారిపై చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ చెరువులో నిర్మాణాలు జరగడంపై అధికారులకు కనిపించడం లే లేదా అంటూ ప్రశ్నించారు. ఈ పురాతన చెరువును నుండి కొత్తూరు ప్రాంతవాసులు త్రాగునీరు పొందుతున్నారని, అటువంటి చెరువులో కొత్తూరుకు చెందిన ఒక వర్గం నేతలు చెరువులో అక్రమ కట్టడాలకు ప్రోత్సహించడం వారి స్వార్ధానికి నిదర్శనమని అన్నారు. కొత్తూరు చెరువు సమస్య పరిష్కారం అయ్యేందుకు తమ పార్టీ అధినేతల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి చెరువును కాపాడేందుకు ఆందోళనలు చేపడతామని జనసైనికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చోడవరపు సింహాచలం, సందీప్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.