రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు సిధ్ధవటం మండలంలోని గ్రామాలలో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. మొట్టమొదటిగా వెంగటాయపల్లి పంచాయతీ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆ గ్రామ ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తూ మాకు 10kmల దూరంలో కడప వుంటే రహదారి లేక 40kmలు సిధ్ధవటం వయా భాకరాపేట మీదుగా ప్రయాణం చేయవలసి వస్తుందని తెలిపారు. మాకు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయించాలని గ్రామ ప్రజలు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా జనసేన పార్టీ మీ పక్షాన పోరాడుతుందని, లేని పక్షంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీయం అయిన వెంటనే మీ రహదారి ఏర్పాటు చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 14,15 ఆర్థిక సంఘం, వెనుకబడిన ప్రాంతం కింద ఈ ఏడాది మీ పంచాయతీకీ 10లక్షల రూపాయలు కేంద్రం కేటాయిస్తే కేవలం లక్షరూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్టు చూపిస్థున్నారని మిగతా డబ్బులు ఎక్కడికి పోయాయని గ్రామ ప్రజలు సర్పంచ్ ని నిలదీయాలని జనసేన నాయకులు చెప్పడం జరిగింది. జనసైనికులతో పార్టీ బలోపేతంపై చర్చిస్తూ గ్రామ భూతు కమిటీలు ఏర్పాటు చేసి ఈ పంచాయతీలో పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్ధేషించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు మాజీ ఆర్టీసీ ఎండీ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు సాయిక్రిష్ణ, సిధ్ధవటం మండల నాయకులు కొట్టే. వెంకట రాజేష్, సిధ్ధవటం పంచాయతీ వార్డుమెంబర్లు పసుపు లేటి కళ్యాణ్, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com