మంగళగిరి ( జనస్వరం ) : తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, ఇప్పటం గ్రామాల్లో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన నాయకులు పర్యటించారు. నష్టపోయిన పంటను పరిశీలించి రైతులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ భారీ వర్షాలకు ఇప్పటం గ్రామంలోని అరటి తోటలకు తుఫాను కోలుకోలేని దెబ్బతీసి వేలాది ఎకరాలలో రైతులకు నష్టాలను చవిచూపించిందని అన్నారూ. తులను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని రైతులు ఆవేదన చెందుతున్నారని, చిర్రావూరు గ్రామంలో ఎటు చూసినా పొలాన్ని వరద చుట్టేసిందని వాన నీటిలో తేలుతున్న వరి ఓదెలు కోతకు వచ్చి పనాలు నేల వాలి నీట మునగడంతో రైతుల ఆశలు నిరాశగా మారాయి. తుఫాను ప్రభావం రైతుల నిండా ముంచిందని ప్రధానమైన వరి పంట గాలికి పడిపోయింది. వర్షానికి పడిన పైరంతా తడిసిపోయిందని అన్నారు. చేలల్లో నీరు పోయే దారి లేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నదాతలు కన్నీరు అవుతున్నారని గత రెండు రోజులుగా కోసిన ధాన్యాన్ని రోడ్డుమీద ఆరబోసుకున్నప్పటికీ తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నల గోడు ప్రభుత్వానికి వినబడడం లేదా ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పలు పోసిన చెమ్మచెరి దెబ్బతింటున్న ధాన్యం కొద్ది రోజుల్లో చేతికి వస్తుంది తమ కష్టాలు గట్టెకుతాయని ఎంతో ఆశతో ఉన్న అన్నదాతను తుఫాన్ కోలుకోని విధంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం యాత్రలపై ఉన్న శ్రద్ధ రైతుల పైన ఏమాత్రం లేదని రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు అంచనా వేసి నష్టపరిహారాన్ని త్వరగా అందించాలని డిమాండ్ చేశారు.