రాజంపేట ( జనస్వరం ) : టి. సుండుపల్లి మండల పరిధిలో రాయచోటికి వెళ్ళే రోడ్డు మీద ఉన్న గుల్లవాండ్లపల్లి కాలనీలో పర్యటించిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రకృతి రిత్యా విపరీతంగా వీచిన గాలి వానలో సుమారు 10 గృహాలకు పైగా స్లాపుతో సహా గాలి తాకిడికి పూర్తి స్థాయిలో నష్టపోయిన భాదితులకు ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సహాయం చేయాలని కోరారు. అక్కడ నివాసితులకు యుద్ధప్రాతిపదికన బాధిత గృహల వారికి ప్రభుత్వ అధికారులు తక్షణ నిధులు కింద మంజూరు చేసి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా తేలికపాటి వర్షం వస్తే మనుషులు అక్కడ ఉండలేని పరిస్థితి అసలే వేసవికాలం తీవ్రంగా కాసే మండుటెండలో వారు ఆ గృహల్లో ఉండలేక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కావున త్వరతీగతిన అక్కడి భాదితులకు పాలకులు, ప్రభుత్వం తరపు నుంచి సంబంధిత శాఖ అధికారులు రాజకీయాలకు అతీతంగా వారిని పెద్దమనుసుతోటి ఆదుకోవాలని జనసేనపార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నా, రెడ్డిరాణి,మదన్ కుమార్, పద్బనాభం, హరిప్రసాద్, జనసైనికులు, యువకులు, మహిళలు, స్థానికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com