
పొందూరు, (జనస్వరం) : పొందూరు మండలం పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికులు కుటుంబాలను ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించారు. అందులో భాగంగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్న నందివాడ గ్రామ జనసైనికుడు పిసిని అప్పలనాయుడు నాన్నని, కాలు నొప్పితో బాధపడుతున్న లైదాం గ్రామ జనసైనికుడు దినేష్ ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు యలకల రమణ, కొంచాడ చిన్నమనాయుడు, రాంబాబు, లక్ష్మణ్, శ్రీరామ్, రాజు, గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.