పాడేరు ( జనస్వరం ) : పెడబరడా పంచాయితి తెరపల్లి గ్రామస్తుల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని సందర్శించిన జనసేనపార్టీ నాయకులు. ఈ సందర్బంగా గ్రామస్తులతో జనసేనపార్టీ నాయకులు ఉల్లి సీతారాం, వంతల రాజారావు, సాయి, అబ్బాయిదోర సమావేశమై గ్రామసమస్యలపై చర్చించడమైనది. అలాగే గ్రామస్తులు తమ ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్య, క్వారీ సమస్య కోసం వివరించడమైనది. గత ప్రభుత్వాల హయాంలో మా గ్రామంలో క్వారీ నిర్వహిస్తున్నారు. ఆ క్వారీ పేలుళ్ళ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని పంటలు బూడిదతో నిండిపోతుందాని త్రాగునీటి కాలుష్యం అయిపోతున్నదని గ్రామస్తులు శ్వాస సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారన్నారు. ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను వివరించిన కూడా పరిష్కరించిన పాపానపోలేదని అన్నారు. జనసేనపార్టీ నాయకులు ఎక్కడ సమస్య ఉన్న పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం మాకు ఆలోసింపచేసిందని మీరైన ప్రశ్నిస్తే ఈ క్వారీ సమస్య, అలాగే మంచినీటి సమస్య తీరుతుందేమోనని మిమ్మల్ని ఆహ్వానించమన్నారు. వంతల రాజారావు, ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తామని త్వరలోనే ఈ నెల 10 వ తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు వస్తున్నారని ఈ అంశంపై నియోజకవర్గ ఇన్చార్జ్ డా..గంగులయ్యతో చర్చించి జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెల్లే విదంగా మా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వంతల రాజారావు కూడా అబ్బాయిదోర, సాయి, బద్రి తదితర నాయకులు జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com