
పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం భోజనం పేట గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకుడు గద్దల రాజు ఆధ్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు CG రాజశేఖర్ మాట్లాడుతూ భోజనం పేట గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి ప్రధాన సమస్య త్రాగునీరు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఊరి ప్రజలు జీవితం మాత్రం మారడం లేదని అన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో వీధిలైట్లు సరిగ్గా లేవు వీధిలైట్లు లేకపోవడంతో ఈ గ్రామంలో ప్రజలు రాత్రి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ గ్రామానికి తారు రోడ్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంతవరకు గ్రామానికి రోడ్డు వేయలేదని తెలిపారు. ఈ గ్రామంలో సిసి రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ, సైడ్ కాలవలు, ఈ గ్రామంలో ఏర్పాటు చేయలేదు. గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా, గాంధీజీ కన్నా కళలు గ్రామ స్వరాజ్యం రావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పటికైనా పాలకులు పోవాలి, సేవకులు రావాలి, ఇప్పటికైనా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి అంటే జగన్ పోవాలి, పవన్ రావాలి, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గంలో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీదే విజయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎర్రి స్వామి, మహబూబ్, బాషా, గోపి, రామచంద్ర, వంశీ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.