Logo
Date of Publish : 23 December 2025, 7:58 pm
Editor : Sake Naresh

అనంతపురం సీఐ శ్రీకాంత్‌ను పరామర్శించిన జనసేన నేతలు

అనంతపురం, డిసెంబర్ 23, (జనస్వరం) : అగంతకుడి దాడిలో కత్తిపోటుకు గురైన అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌ను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. నగరంలోని సీఐ శ్రీకాంత్ స్వగృహానికి వెళ్లిన జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు, వాల్మీకి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకే ఈశ్వరయ్య ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, నూర్ బాషా/దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ఇమామ్ హుస్సేన్ కూడా హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్ త్వరగా కోలుకొని మళ్లీ యధావిధిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని వారు కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com