మృతుని కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు మేరుగు నరేష్ ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ నేపద్యంలో జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కురాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు శనివారంనాడు మృతుని కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రఘాడ సానుభూతిని తెలిపారు. అలాగే వారికి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబంలో తమ ఇద్దరి కొడుకులను ఇదే తరహాలో కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వారు ఆదుకునేలా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, తోట శ్యామ్, హనుమంతు దిలిప్, బొడ్డేపల్లి వెంకటేష్ తోపాటు ఆగ్రామ జనసైనికులు ధర్మారావు, లక్ష్మినారాయణ, జగన్నదరావు, జనార్థన, నారాయణ, రాజు, జగన్ అప్పలరాజు, జగదీష్, ఏకోవా, అప్పలస్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com