పెందుర్తి ( జనస్వరం ) : పెందుర్తి నియోజకవర్గంలో సబ్బివాలా చేలు వద్ద సుమారు 10 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ, కనీసం వీధిలైట్లు లేకపోవడం వలన రాత్రి సమయంలో పాములతో, బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లిన పట్టించుకోలేదని స్థానిక ప్రజలు వాపోయారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో నరవ జనసేన పార్టీ ఆర్థిక సహాయంతో వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మౌలిక వసతులు లేక ఈ యొక్క కాలనీ ప్రజలు బాధపడుతున్నారు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యల కోసం మాట్లాడితే ఇంటికి రావాలని చెప్పడం సమంజసం కాదని, ప్రభుత్వాలు ప్రజల వద్ద పన్నులు తీసుకోవడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపాలని అన్నారు. స్థానిక కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనకు చెంప దెబ్బగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వాలు ప్రజల యొక్క మౌలికలు ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపాలని కోరుకున్నారు. బొడ్డు నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గడపగడపకు వైఎస్ఆర్సిపి అనే ప్రోగ్రాంలో చాక్లెట్లు పంచడం కాదు ప్రజా సమస్యలు తీర్చేడానికి పనిచేయడానికి మిమ్మల్ని గెలిపించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ చెత్త పన్ను కట్టితేనే పెన్షన్లు, అమ్మవడి మీకు వస్తాయి. దానికి దీనికి ఏమిటి సంబంధం చెత్త పన్ను కట్టినప్పుడు మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం ఉంటుందని అన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ జనసేన పార్టీ వారు ఈ యొక్క వీధిలైట్లు ఏర్పాటు చేయడం వలన మాకు చాలా ఉపయోగం ఉంటుందని అన్నారు. రాత్రి సమయంలో పాములు మరియు ఇతర అపాయలు నుంచి మాకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గవర శ్రీనివాస్, బోబ్బర్ శీను, ప్రవీణ్, శంకర్ రావు, శివ, కుమార్, రాడి పెంటారావు, అప్పలరాజు, వీరమహిళలు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.