88 వార్డ్ పెందుర్తి నియోజకవర్గం, విశాఖపట్నం నరవ గ్రామంలో జనసేన పార్టీ ప్రజా సమస్యల నివృత్తి ధ్యేయంగా రెల్లివీధి పర్యటనలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారు కి పలు సమస్యలను కాలనీ ప్రజలు వివరించారు.
👉సుమారు 30 కుటుంబాలు ఇల్లు పట్టా స్కీమ్ కి అర్హులుగా ఉన్న మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని, మేం పెట్టిన అప్లికేషన్స్ ని ఎక్కడికి వెళ్ళాయో అసలు మాకు అప్లై చేశారో లేదో ఈ ప్రభుత్వంపై అనుమానాలున్నాయని అన్నారు.
👉అమ్మ వడి వలన ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు కూడా 15000 ఇవ్వడం వల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుంది, నరవ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు సరిపడే టీచర్స్ లేక పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది గురవుతున్నారు. ఇటువంటివి ప్రభుత్వాలు గుర్తించాలని అమ్మఒడి ధనాన్ని విద్య అభ్యసించడానికి ఉపయోగిస్తే బాగుంటుందని కోరారు. ప్రజలను సోమరిపోతులు తయారు చేయకూడదని ఒక వ్యక్తి చాలా విపులంగా చెప్పడం జరిగింది.
👉సుమారు 15 సంవత్సరాల నుంచి మా కాలనీ లో హౌస్ టాక్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా యొక్క సమస్యలను అటు అధికార పార్టీ YSRCP పార్టీ గాని ఇటు ప్రతిపక్షం TDP పార్టీ గాని మమ్మల్ని ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారు కానీ మా ప్రజల్ని మనుషులుగా గుర్తించడం లేదని వాపోయారు. ఓట్లేసి గెలిపించిన పెందుర్తి MLA అదీప్ రాజు గారు ఉన్నారా లేరా ? మీలాంటివారు ఇప్పుడు వచ్చే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా అని అడగడం మాకు ఎంత సంతోషంగా ఉంది అని వారి యొక్క బాధలను వ్యక్తపరిచారు.
శ్రీకాంత్ గారు మాట్లాడుతూ వెంటనే వాలంటరీని పిలిపించి అర్హుల గల కుటుంబాలు పేర్లను నమోదు చేయించి, 20 సంవత్సరాల క్రితం మీ తల్లిదండ్రులకు ఈ యొక్క ఇండ్లను ఇచ్చిందని ఇప్పుడు మీకు కూడా ఒక కుటుంబం ఉందని మీలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి గాని ఇబ్బందికి గురి చేయకూడదని వెంటనే మీ సమస్యలను పై స్థాయి అధికారులు తీసుకుని వెళ్లి మీకు సహాయపడతారని తెలపడం జరిగింది. చెప్పినట్టుగానే అధికారులను కలిసి సమస్యలను వివరించారు. అధికారులు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బొడ్డు నాయుడు, ప్రవీణ్, రాజేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ను ఆప్ లో కూడా చదవచ్చు.. డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com