Logo
Date of Publish : 18 September 2023, 12:35 am
Editor : Sake Naresh

రాజాంలో టిడిపి రిలే దీక్షకు జనసేన నాయకులు యు.పి.రాజు సంఘీభావం

     రాజాం ( జనస్వరం ) : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా రాజాం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొండ్రు మురళి మోహన్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు అని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని అన్నారు.అందరూ జనసేన టీడీపీ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు, నాలుగు మండలాల నాయకులు ఎన్ని సత్యనారాయణ, హరిబాబు, నాగరాజు, ఈశ్వర్, చిరంజీవి, గణేష్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com