విశాఖపట్నం ( జనస్వరం ) : పాడేరు మండలం డేగలవీధి గ్రామంలో జనసేన నాయకులు పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమవుతూ గ్రామస్తులు ముందుగా పంచాయితీ పరిధిలో గలా రోడ్లు, డ్రైనేజి, పంటకాలువకు సంబంధించిన సమస్యలు పాడేరు, అరకుపార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపురు గంగులయ్య కు వివరించారు. జనసేన పార్టీ ఇంచార్జ్ గంగులయ్య మాట్లాడుతూ మన ఓటుహక్కుతో ప్రజాస్వామ్యాన్ని నిర్దేశించుకునే దేశం మనది. ఈ ఓటుని డబ్బులకు అమ్ముకుని మన అభివృద్ధిని మనమే కాలరాస్తున్నాం. ఇప్పటివరకు మన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు మన సమస్యలపై కనీస అవగాహన లేదు. మండల కేంద్రానికి పట్టు మని పది కిలో మీటర్ల దూరం లేని ఈ గ్రామం రోడ్డు చూస్తే అర్థమౌతుంది. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతమైన రాజకీయాల వైపు ఆలోచన చెయ్యడం మంచిది. ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ముందస్తుగా ఎందుకు ప్రకటించరు? ప్రకటించే సమయానికే దళారుల చేతికి పంట చేరిపోతుంది. పరోక్షంగా మద్యవర్తులకు సహకరిస్తున్నారు. జీసీసీ ని నిర్వీర్యయం చేశారు.డబ్బులేని గిరిజన సంస్థగా మార్చేశారు గిరిజన అభివృధ్ధికోసం ఐ.టి.డి.ఎ., ప్రజాప్రతినిధులున్నారు. కానీ వారి మొదటి కర్తవ్యమే మరిచారు. దేశం బాగుపడలంటే గ్రామసీమలు ముందు అభివృద్ధి చెందాలి కానీ పంచాయితీ అభివృధ్ధి కోసం నిధులు లేవంటారు. సర్పంచ్ అధికారాలకు తిలోదకలిచ్చారు. ఇంకెక్కడి పంచాయితీ అభివృద్ధి జరుగుతుంది. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాంగి సూర్యారావు, నందోలి బాబూరావు, పల్లిబొయిన చిన్నారవు, గోరపల్లి విశేశ్వరావు, నందోలి రాంబాబు, కిల్లో చిట్టిబాబు, గోరపల్లి ప్రసాద్, రెగం రాధాకృష్ణ, మహిళలు, రేగం సోములమ్మ, దూరు రత్నాలమ్మ, పాంగి చెల్లమ్మ, నందోలి సోములమ్మ, గోరపల్లి నేలమ్మా, జనసేన ప్రచార కార్యదర్శి పాంగి వెంకటేష్, మండల అధ్యక్షులు నందోలి మురళి, ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, సంతోష్,షణ్ముక్, తదితర జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com