
పాలకొండ, (జనస్వరం) : గిరిజన సేన – జనసేన కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, రామాపురం గిరిజన గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తులతోనే వ్యవస్థలో ఉన్నతమైన, ఉత్తమమైన మార్పులు వస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ ఉన్నతమైన, ఉత్తమ మైన వ్యవస్థ ఏర్పాటు చేసేది జనసనపార్టీ అని ఉద్భోదించారు. మన జనసేన పరివారం ఎంత పెద్దదైతే అంత గొప్ప విజయాలు జనసేన పార్టీ సొంతం అవుతాయని తెలియజేసారు. గుండె ధైర్యం అంటే జిమ్ కి వెళ్తే వచ్చేది కాదు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి ఆ సమస్య పరిష్కరిస్తే వచ్చే ఆనందంమే తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓట్లు, నోట్లు, అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదు, యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడానికి వచ్చారని తెలియజేసారు. సమాజంలో మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయటం కాదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడి అభిప్రాయం చెప్పాలని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే బలమైన సంకల్ప బలం ఉండాలని తెలిపారు. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని, అవమానాలకు ఎదురొడ్డి నిలబడాలని తెలిపారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడ్డారు తప్పా! కులాలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరిగిన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ గ్రామీణ స్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెలలో విశాఖపట్నం వేదికగా జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ఉంటుందని పాలకొండ గిరిజన నియోజకవర్గo(ST)లో ఉన్న గిరిజనులు సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు మీరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువత మేము జనసేనపార్టీకి అండగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో మా ప్రాంతంలోని గిరిజన ప్రజల ఓట్లు జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకి వేసే విధంగా మార్పు తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బి.పి. నాయుడు, కుంబిరిక ఢిల్లీశ్వర్, బిడిక వినోద్, బిడిక నవనీత్, గుమ్మడి సుధాకర్, వావిలిపల్లి నాగభూషణం, దండేల సతీష్, కర్నేన సాయి పవన్, అన్ను.రామకృష్ణ, కంటు మురళి తదితర జనసైనికులు పాల్గొన్నారు.