రాజంపేట, (జనస్వరం) : జిల్లాల విభజన వల్ల రాజంపేటను కాకుండా రాయచోటిని జిల్లా చేయడం వల్ల సిధ్ధవటం ప్రజలు చాలా నష్టపోతారని, కడపకు 20 కిలోమీటర్లు దూరమని, రాయచోటి 70 కిలోమీటర్లు అని సిధ్ధవటంను కడపలోనే కలపాలని సిధ్ధవటం మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు, సంతకాల సేకరణ, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జనసేన నాయకులు, కార్యకర్తలు పోరాటాల ఫలితంగా సిధ్ధవటంను కడపజిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ణతలు తేలియజేస్తు ఈ విజయం జనసేన పార్టీ విజయమని సిధ్ధవటం మండల నాయకులు కొట్టే.వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడుతూ సిధ్ధవటం మండల ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ జనసేన పోరాటాలను అభినందించారు.