ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలలోని సిద్దిపురం పంచాయతీ పరిధిలోని అనసూయ నగర్ కి చెందిన పత్తిపాటి వెంకటరమణయ్యకి వెంగారెడ్డి పాలెం సమీపంలో బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది. బైక్ ఆక్సిడెంట్ లో వెంకటరమణయ్యకి కుడి కాలు తీవ్రంగా గాయపడినది. ఆ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షుడు దాడి భాను మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన పత్తిపాటి వెంకటరమణయ్యని పరామర్శించి, పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ రమణయ్యకి జనసేనపార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు ఆకులేటి సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com