ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం నియోజకవర్గం కేదారిపురం గ్రామంలో పూరింట్లో నివసిస్తున్న నరసింహశెట్టి, చంద్రమ్మశెట్టి వారి ఇల్లు నిన్న రాత్రి కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజకి తెలియపరచడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మీకు మీ కుటుంబాన్ని జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ తరఫునుంచి దాసరి రాజు ఒక రైస్ ప్యాకెట్ నిత్యవసర సరుకులు, కూరగాయలు, మరియు తిప్పన దుర్యోధన రెడ్డి 1000 రూపాయలు, అక్కడ స్థానిక జనసేన నాయకులు బోర మోహన్ రావు 1000, రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజు శెట్టి, గణేష్, రాజేష్, టున్న శెట్టి, ఇచ్చాపురం మున్సిపాలిటీ10,11,వార్డ్ ల ఇంచార్జ్లు రోకళ్ల భాస్కరరావు, కలియ గౌడో, సతీష్, అశోక్, కోగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com