Logo
Date of Publish : 16 September 2023, 7:53 pm
Editor : Sake Naresh

పాలకొండలో టిడిపి రిలే దీక్షకు జనసేన నాయకుల మద్దతు

      పాలకొండ ( జనస్వరం ) : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా పాలకొండ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు పాలకొండ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు జనసేన నాయకులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి పూల మాల వేసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. అతని నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు టీడీపీ చేస్తున్న దీక్షకు జనసేనపార్టీ తరుపున మద్దతు తెలపడం జరిగింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారు అని, ఇంకో ఆరు నెలలలో ఈ రాక్షస పాలన అంతంకాక తప్పదు అని అన్నారు. అధికారంలో ఉండి వైసీపీ చేసిన అవినీతిని బయటికి తీసి జైలుకు పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com