శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి, వీర మహిళలు డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి జనసేన ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చించారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా బలంగా మనం ముందుకు వెళ్లాలి అనే దాని గురించి వివరించారు, అనంతరం వచ్చే ఎన్నికల్లో ఈ 15 రోజులు గడపగడపకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన రవికుమార్ యాదవ్ గెలుపు కొరకు కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు వీర మహిళలు మరియు జనసేన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తామని తీర్మానం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com