Logo
Date of Publish : 30 April 2022, 2:47 am
Editor : Sake Naresh

అచ్యుతాపురం గ్రామ ప్రజలు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

     అచ్యుతాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, అచ్యుతాపురం గ్రామం మధ్య నుండి ఐఓసిఎల్ కేంద్రానికి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన విద్యుత్ టవర్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు గ్రామస్థులతో కలిసి గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని స్థానిక డి.ఎస్.పి కదలి వెంకటేశ్వరరావు, కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, గోపవరం తహశీల్దార్ పోసిబాబు, గోకవరం ఎస్సై నాగబాబు తదితరులు సందర్శించి దీక్ష విరమించాలని సూచిస్తూ చర్చలు జరిపారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతోందని ఉన్నత అధికారులు ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామం మధ్య నుండి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు వినతిపత్రం ఇదివరకే ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో దగ్గరి దారిలో ఈ లైన్ నిర్మాణం చేయడం వల్ల గ్రామానికి ఇబ్బంది ఉండదని తెలియజేసినట్లు వివరించడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ పనులు నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు ఉంగరాల మణి రత్నం, గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లల వెంకన్నబాబు, పలువురు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com