Logo
Date of Publish : 12 December 2020, 11:16 am
Editor : Sake Naresh

సమస్య కోసం పోరాటం చేసి విజయం సాధించిన జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్

సమస్య కోసం పోరాటం చేసి విజయం సాధించిన జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్

                రహదారులకు మరమ్మత్తులు చేయాలనే డిమాండ్ తో ప్రత్యేక ఆర్థిక మండలి ( సెజ్ ) కేంద్రంలో జనసేన ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ సుందరపు విజయ్ కుమార్ చేపట్టిన దీక్ష శుక్రవారం విరమించారు. గురువారం ఉదయం ఆయన అచ్యుతాపురం కూడలిలో మెరుపు ఆందోళనకు దిగారు. పనులు ప్రారంభించే వరకూ కదిలేది లేదంటూ రాత్రంతా కూడలిలోనే కూర్చుండిపోయి ఆందోళన కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం ఆర్ అండ్ బీ ఎస్సై కేశవరావు, ఎలమంచిలి డీఈ విద్యాసాగర్ అచ్యుతపురానికి వచ్చి ఆయనతో చర్చించారు. ముందుగా అచ్యుతాపురం - రామన్నపాలెం రోడ్డులో మరమ్మత్తులు చేపట్టడానికి జేసిబిని రప్పించిన అధికారులు పనులు లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. సెజ్ కంపెనీలు, పోలీసులు, ఏపీఐఐసీ అధికారులతో సోమవారం ఏర్పాటు చేసి మిగిలిన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి కార్యచరణ రూపొందిస్తామని అధికారులు ప్రకటించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసి నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు అగ్గాల హనుమంతరావు సంఘీభావంగా దీక్ష కొనసాగించారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను విమర్శించడం మాని వేలాదిమంది ఉద్యోగులు తిరిగే రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. అంతకముందు జనసేన నాయకులు కోన తాతారావు గారు దీక్ష చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ గారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా ముందుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com