రాజంపేట ( జనస్వరం ) : రాజంపేటలో అత్యధికంగా యువకులు బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. యువకులు లక్షల రూపాయలు అప్పులు చేసి వీసాలు సంపాదించుకున్నారు. పిసిసి లు రాకపోవడంతో వీసాలకు కూడా టైం అయిపోయు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్ బాధితులతో కలసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశంకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో గల్ఫ్ వెళుతున్న యువకులకు పీసీసీ లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు. సరికదా యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటే అడ్డంకులు కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించకపోవడం శోచనీయం. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com