Logo
Date of Publish : 25 August 2020, 9:19 am
Editor : Sake Naresh

SC & ST సబ్ ప్లాన్ నిధులతో మౌలిక వసతుల కల్పన చేపట్టాలని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారికి వినతి పత్రం సమర్పించిన జనసేన నాయకులు

SC & ST సబ్ ప్లాన్ నిధులతో మౌలిక వసతుల కల్పన చేపట్టాలని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారికి వినతి పత్రం సమర్పించిన జనసేన నాయకులు

      కడప నగరం 18 డివిజన్ పరిధిలోని AL కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పైబడినదని, ఈ కాలనీ వాసులు అందరూ దాదాపు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి ప్రజలు అయినప్పటికీ వీరికి మురుగు కాలువలు, త్రాగునీరు, రోడ్లు, వీధిలైట్లు వంటి కనీస వసతుల ఏర్పాట్లు సంపూర్తిగా చేయబడలేదన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లో పంచాయతీల విలీనం జరిగి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నిరుపేదలు అయినటువంటి షెడ్యూలు తెగలు నివసిస్తున్న ఈ కాలనీలో మౌలిక వసతులు పరిపూర్తిగా కల్పించకపోవడం అన్యాయమని జనసేన పార్టీ భావిస్తున్నదన్నారు. ఈ ఆధునిక యుగంలో కూడా కడప నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్ తెగలకు చెందిన నిరుపేద ప్రజలు కనీస మౌలిక వసతుల కల్పన లేని కారణంగా మురికి నీరు, వర్షపు నీరు ప్రవాహంగా మారుతున్న నేపథ్యంలో అపరిశుభ్ర వాతావరణం మధ్య తమ పిల్లతో, వయసు మళ్ళిన వృద్ధులతో కలసి నివసిస్తూ అనేక మైనటువంటి విష జ్వరాల బారిన పడి సరైన వైద్యం చేయించుకోలేక సతమత మవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కనీస వసతుల లేమి కారణంగా షెడ్యూలు తెగలకు చెందిన ఈ ప్రజల వ్యధ నేపథ్యంలో వీరి జీవించే హక్కు హరించబడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కడప జిల్లాలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కాలనీ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత, అవసరం కడప కార్పోరేషన్  వారి మీద ఉన్న విషయం అధికారులు గమనించవలసిందిగా వినతిపత్రం ద్వారా కమిషనర్ గారిని సవినయంగా కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కమీషనర్ గారు SC & ST ప్రణాళిక నిధుల ద్వారా సత్వరం కాలనీలో మౌలిక వసతుల కల్పన చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నరు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసన్న, 18వ డివిజన్ ఇంచార్జి అతి గారి నాగేంద్ర, నగర కార్యదర్శి K. సురేష్ బాబు, నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com