
ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ కాలెండరుని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు AISF, SFI, PDSU మరియు యువజన సమాఖ్య AIYF, DIYF, APNPS ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి జనసేన, బిజెపి ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు పేడాడ రామ్మోహనరావు మద్దతుగా నిలిచారు. ఈ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయా సంఘాల నేతలను, రామ్మోహనరావు తదితరులను అరెస్టు చేసి స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పేడాడ రామ్మోహనరావు గారు మాట్లాడుతూ ఉద్యోగ క్యాలెండర్ పేరుతో రాష్ట్రం లోని నిరుద్యోగులను మోసం చేశారని, ఈ రాష్ట్రం లో పుట్టడమే వారు చేసిన పాపమా? అని వాపోయారు. సత్వరమే ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త క్యాలెండర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాటానికి జనసేన సిద్దంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.