రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో రాయచోటి వెళ్ళే రోడ్డు మీద రాచంవాండ్లపల్లిలో బోరింగ్ పనిచేయకపోవడంతో త్రాగడానికి కూడా నీరు లేక చాలా రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఆయన అక్కడ పర్యటించి మాట్లాడుతూ అసలే వేసవికాలన్ని దృష్టిలో పెట్టుకుని త్రాగడానికి మంచి నీరు అందించేందుకు పాలకులు, సంబంధిత శాఖ ప్రభుత్వఅధికారులు, వెంటనే దృష్టి సారించి చెడిపోయిన బోరును తక్షణ నిధులు కింద మంజూరు చేసి బోర్ మఱమ్మతులు చేసి అక్కడ నివాసులకు దాహం తీర్చాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి తగిన నిధులు మంజూరు చేసి సింగిల్ పేస్ మోటార్ ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీసీ లీడర్ ఐరాజు, గంగయ్య, ఈశ్వర్, రెడ్డయ్య, గంగాదేవి, లక్ష్మీదేవి, అక్కయ్య, రమణమ్మ, మహిళలు, స్థానిక నివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com