రాజంపేట అప్పరాజు పేట పంచాయతీ లో నివసించే తాళ్ళపాక సుబ్బన్న చెల్లెలు మందా అనసూయమ్మ భర్త చనిపోయి తన మూడేళ్ల పాపను చూసుకోవటం కోసం పసి పాపను అన్న ఇంట్లో వదిలి బతుకుదెరువు కోసం రైల్వే కోడూరు వై కోట కు చెందిన ఏజెంట్ ద్వారా మలేసియా వెళ్లింది. అప్పటి నుండి ఎలాంటి సమాచారం లేకుండా ఉండిపోయింది.. మలేసియా వెళ్లిన రోజు నుండి ఏజెంట్ దేవాతో ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఏజెంట్ దేవా అనే వ్యక్తి రైల్వే కోడూరు మండలం వై కోట వాసి అయినందున ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో 2019 నవంబర్ లో ఫిర్యాదు చెయ్యగా ఏజెంట్ ద్వారా వివరాలు తెలుసుకొని వీడియో కాల్ చేయించి మాట్లాడించారు.. ఆ తర్వాత రెండు నెలల తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.. వారం రోజుల క్రితం ఒక తమిళ మహిళ చేరదీసి వాట్సప్ ద్వారా కాల్ చేసి మోసపోయానని తన దగ్గర డబ్బు, పాస్ పోర్ట్ లేదు తిరిగి వచ్చేస్తా అని ఏడుస్తూ చెప్పగా అది రాజంపేట జనసేన పార్టీ నాయకుల దృష్టికి వచ్చింది. వారిని విచారించి మలేసియా లో ఉన్న మహిళతో మాట్లాడి, ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ కెళ్ళి వివరాలు సేకరించి ప్రవాసాంధ్ర కేంద్రం ద్వారా ఆమెను తిరిగి రప్పిస్తామని ఆమెకు, ఆమె కుటుంబానికి మనో ధైర్యాన్ని నింపి వారి దగ్గర నుండి వ్రాత పూర్వకంగా సమస్య వివరాలను తీసుకొన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ద్వారా బాధిత మహిళను తిరిగి ఇండియాకు తెచ్చే ప్రయత్నం చేస్తాం అని PSV ప్రతినిధి ఫోన్లో జనసేన నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, కత్తి సుబ్బారాయుడు, తాళ్ళపాక శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com