
అరకు, (జనస్వరం) : విజయనగరం జిల్లా లచ్చయ్యపేట చక్కెర కర్మాగార బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించి అరెస్టు చేయడాన్ని ప్రభుత్వ కుట్రలో భాగంగానే జనసేన నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై విశాఖ మన్యం ప్రాంతం నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు సాయిబాబా తీవ్రంగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని మరింత ఉద్యమాలు ముందుకు వెళ్తాయని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంతే కాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకులను, కార్యకర్తలను నిరసనలు చేయకుండా తుంగలో తొక్కుతూ భగ్నం చేయడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తున్నదని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం సమస్యలు నిరసన ద్వారా తెలియజేసేందుకు ముందుకొచ్చినటువంటి లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం బాధితుల సమస్యలును తక్షణం ప్రభుత్వం స్పందిస్తూ పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.