కర్నూలులో బ్రిడ్జి మరమ్మత్తు గురించి జనసేన నాయకులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు
కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు వక్కెర వాగు రాత్రి కురిసిన వానకు బ్రిడ్జ్ మొత్తం నీటిలో మునిగి పోయి ఉధృతంగా ప్రవహిస్తోంది.. జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు మరియు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు మరియు కల్లూరు మండల నాయకులు వంతెనను సందర్శించడం జరిగింది. చింతా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ వంతెన కల్లూరు మండలం నుంచి కర్నూలు పట్టణంలోకి వెళ్లే మార్గం నిత్యము దాదాపుగా 50 వేల మంది దాకా రాకపోకలు సాగిస్తారు, గత ప్రభుత్వానికి మరియు ఇప్పుడున్న ప్రభుత్వానికి వంతెన ఎత్తులు లేదా నూతన బ్రిడ్జ్ ను నిర్మించాలని చాలాసార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాగే పట్టనట్టు వ్యవహరిస్తే జనసేన పార్టీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్ ను దిగ్బంధనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసేన మంజునాథ్, B.సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, B.K నాగరాజు, షబ్బీర్, K.భాస్కర్, మల్లికార్జున, రఫీ, ఓబులేష్, అంజి, ఎల్లప్ప, వీరేష్, చంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.