గాజువాక నియోజకవర్గంలో కోవిడ్ యాక్షన్ సెంటర్ ఒకటే ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెదగంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత వారం రోజులుగా 2nd డోస్ కరోనా టీకా వెయ్యటము లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 వార్డులకు(64,74,75&76) సంబంధించిన సుమారు 80,000 మందికి వైద్య సేవలందిస్తున్న ఈ PHCలో ఈ విధముగా ఎందుకు జరుగుతుందో, మిగతా PHCలతో పోల్చుకుంటే మొదటినుండి వాక్సినేషన్ విషయములో గాని టెస్టుల విషయములో గాని ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి ఇకనైనా దినసరి కూలీలు, పేదవారు ఎక్కువగా జీవించే ఈ ప్రాంతములో అవసరం మేరకు వాక్సినేషన్, మరియు కరోనా టెస్టులు జరిగేలా చూడాలని 64వ వార్డు జనసేన నాయకులు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద రెడ్డి గారు, 75వ కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి గారు తోటి కార్పొరేటర్లు అయిన గంధం శ్రీనివాసరావు గారు, స్థానిక నాయకులు వెంకటరమణారెడ్డి గారితో కలిసి DMHO గారికి వినతి పత్రం అందచేస్తూ సమస్యపై త్వరితగతిన సరిఅయిన చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. దీనిపై సానుకూలముగా స్పందించిన DMHO గారు పెదగంట్యాడ PHC లో అవసరమైన అన్ని చర్యలు తీసుకొని ఇకపై ఏ సమస్య రాకుండ చూస్తానని హామీ ఇచ్చారు.