చంద్రగిరి ( జనస్వరం ) : చంద్రగిరిలో జనసేన నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే చెవిరెడ్డి అవినీతిని జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి సాక్ష్యాలతో ప్రశ్నించడం జరిగింది. 2019లో మీ అప్పులెంత..? 2023లో మీ ఆస్తులెంత..? మీ తనయుల సూట్ కేస్ కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడివి..? రూ.25 కోట్లతో సంక్రాంతి కానుకలు ఇచ్చారా..? ఇది అవినీతి సొమ్ము కాదా..? ఏం వ్యాపారాలు చేశారు..? ఎంత సంపాదించారు..? ఇన్కమ్ టాక్స్ ఎంత కట్టారు..? 2019 ఎన్నికల అఫిడవిట్ లో మీ ఇద్దరు కుమారులను డిపెండెంట్స్ గా చూపించారు. డిపెండెంట్స్ వేల కోట్ల కంపెనీలు ఎలా స్థాపించారు..? రూ.25 లక్షలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు యువకులు గుర్తు రాలేదా…? రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా సంతల్లో ఒక్క రోజు అన్నదానం చేస్తున్నారు. మిగిలిన ఆరు రోజులు కడుపు మార్చుకోవాలా..? తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ వేల కోట్లు విలువైన 22 ఎకరాల మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తారా..? డా.వై.ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన ఐఎఎస్ అధికారులు అవినీతి ఆరోపణలతో ఇప్పటి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల అవినీతి బాగోతం కూడా జనసేన పార్టీ లెక్క కడుతుంది. అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. గడప గడపకు తిరగాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సెంటర్లో నిలబడి సమస్యలు అడిగితే కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి. తుడా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..? ప్రజా క్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై అంశాలపై చర్చకు వస్తే జనసేన సిద్దమని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com