వీరఘట్టం, (జనస్వరం) : వీరఘట్టం మండలం కిమ్మి గ్రామం నాగావళి నది పై నిర్మించిన కిమ్మి – ఋషింగి వంతెనను పాలకొండ నియోకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగా దొంగా ఊర్లు పంచుకునే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఇప్పటి అధికార పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే బ్రిడ్జి పనులు చేయాలని ధర్నా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు గడుస్తున్నా, ఈ వారధి పనులు పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటో తెలియడం లేదన్నారు. రెండు మండలాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందు అధికార పార్టీ వాళ్ళు కి కనిపించడం లేదా ? ఈ వారధి పూర్తి ఐతే ప్రజలకు వ్యాపార రవాణాకు చాలా ఉపయోగ కరంగా ఉంటాది అని ఇంతవరకు ఈ బ్రిడ్జి పనులు చేయకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భం గా అన్నారు. అలాగే దీనిపై కలెక్టర్ గారికి వినతపత్రం ఇస్తాము అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జనసైనికులు రౌతు గోవిందు, సత్యనారాయణ, రవి, పుందరికం,రవికుమార్, మన్మధ, శివ, నరేంద్ర,ప్రసాద్, వెంకటరమణ, కిరణ్, ఉమా, భాను ప్రసాద్ యేసు మోహన్ బీజేపీ నేతలు టంకల దుర్గారావు నారాయణరావు రమేష్ మరియు తదితురులు పాల్గొని విజయవంతం చేశారు.