Logo
Date of Publish : 17 July 2022, 5:18 am
Editor : Sake Naresh

వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నాయకులు పూల శివప్రసాద్

             పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువులోని 2,3వ వార్డులలో సచివాలయాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. జనసేన పార్టీ మండల కన్వీనర్ పూల శివప్రసాద్ పుట్టపర్తి నియోజవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తచెరువులో గడిచిన మూడు సంవత్సరాల కాలం నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యేని నిలదీశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయి సంవత్సరాలు గడుస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొత్తచెరువు కూడలి రోడ్లలో డివైడర్ల పైన ఉన్న వీధిలైట్లు కూడా నెలల తరబడి పని చేయకున్నా ఇంతవరకు వాటిని మరమ్మతులు చేయలేదన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో BC కాలనీలో పర్యటించి ప్రజలతో మమేకమవ్వగా అక్కడ రోడ్లకి సరైన సైడ్ కాలువలు లేక రోడ్లు మొత్తం మురికి గుంటలుగా తయారైపోయాయని , పంచాయతీ వారు కనీసం శానిటైజేషన్ కూడా చేయట్లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. దర్గా వీధిలో ఉన్న మసీదు దగ్గర ఉన్న రోట పరిస్థితి కూడా డ్రైనేజి కాలవలు లేక అధ్వానమైన దుస్థితిలో ఉందని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి అన్నిటి పైన తక్షణమే తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేని నిలదీయగా, త్వరలోనే పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే స్పందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com