అనంతపురం ( జనస్వరం ) : Sk యూనివర్సిటీలో విద్యార్థులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో జనసేన నాయకులు పర్యటించి జనస్వరం క్యాలెండర్స్ ను వర్తకులకు పంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, అనంతపురం రూరల్ మండల అధ్యక్షులు రామాంజినేయులు, జనసేన భగత్ సింగ్ యూనియన్ లీడర్ హెన్రీక్ పాల్ ముఖ్య అథితులుగా విచ్చేశారు. పవన్ కుమార్ మాట్లాడుతూ దేశానికి భవిష్యత్తు విద్యార్థులే ఆయుధమని అందుకే విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతం అయినా SK యూనివర్సిటీలోని టీ స్టాల్, సెలూన్ షాప్స్, టిఫెన్ షాప్స్, ఇంటర్నెట్, జిరాక్స్ తదితర షాపులలో జనసేన పార్టీ సిద్దాంతాలు, ఆశయాలను తెలియజేసే క్యాలెండర్స్ ను వర్తకులకు పంచామన్నారు. రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని అన్నారు. రామాంజినేయులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవిధంగా శ్రమిస్తామన్నారు. హెన్రీక్ పాల్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు రావాలంటే జనసేనపార్టీతోనే సాధ్యమని అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రతి యేటా జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఎద్దేవా చేశారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి, యువ జనసేన నాయకులు సాకే రవి, జియా ఉల్హా, లోకేశ్, మహేంద్ర, నరేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.