ఆచంట నియోజకవర్గంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఆచంట నియెజికవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల వేడుకల్లో భాగంగా మూడవ రోజు పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో పారిశుధ్య కార్మిక సోదరులకు వనంపల్లి జనసేన నాయకులు కడలి నాగకుమార్ గారి ఆర్థిక సహాయంతో పెనుమంట్ర జనసేన నాయకులు ఆధ్వర్యంలో 100 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నర్సాపురం పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు చిట్టూరి శ్రీనివాస్, మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆచంట నియెజికవర్గం లో నాలుగు రోజులు సేవాకార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు పేదలకు అన్నం పెట్టాలనే ఆశయంతో ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి సమాజంలో వ్యాధులు ప్రబలకుండా తమ వంతు కృషి చేస్తూ ప్రజల ఆరోగ్యాలనుకాపాడుతున్న పారిశుధ్య కార్మికుల సోదరులను ఆదుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు కార్యక్రమంల ఆచంట నియెజికవర్గం జనసేన నాయకులు జోగి గంగబాబు వరుకుటి చిరంజీవి బోనం నర్సింహమూర్తి, తోట తాతాజీ, అడబల అజయ్, తోట సాయి బాబా మొదలగువారు పాల్గొన్నారు.