Logo
Date of Publish : 14 July 2021, 10:56 am
Editor : Sake Naresh

సర్వేపల్లిలో పారిశుధ్య కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

               సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నందు జనసేన పార్టీ నాయకులు బోబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడాలి అనే ఉద్దేశంతో కుటుంబాలను కూడా పక్కనపెట్టి కష్టపడుతున్న డాక్టర్లు, పోలీస్ వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతుగా గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్, కూరగాయలను అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందించాలని జనసేన పార్టీ తరపున కోరారు. రాబోయే రోజుల్లో వర్షాలతో కాలువలు నిండిపోయి రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కావున పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగించాలనీ ప్రజలు అంటు రోగాల బారిన పడకుండా కాపాడాలని జనసేన పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయి, ప్రవీణ్, సందీప్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com