శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలాంత్రకోట పంచాయతీలోని ఉప్పరపేట గ్రామంలో ప్రమాదవశాత్తు మూడు పూరిల్లు దగ్ధమైన సంఘటనని కంచిలి మండల నాయకుడు క్రాంతి గారు జనసేన నాయకులు బొండాడ మహేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బొండాడ మహేష్ గారు సాయంగా జనసేన పార్టీ తరపున 15000వేల రూపాయల నగదు మరియు 75కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో 200వందల కుటుంబాలు నివసిస్తున్నాయి కానీ కనీస మౌలిక వసతులు కూడా లేవు... నీసం రోడ్డు సదుపాయం కూడా లేదు అని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి త్రాగునీటి సమస్య ఉందన్నారు. స్థానిక మంత్రి పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు. దాదాపుగా గ్రామంలో చాలా కుటుంబాలు ఇలాంటి గుడిసెల్లోనే బ్రతుకుతున్నారు, ఇలాంటి నిజమైన పేదవారికి ఇల్లు ఇప్పించాలని కోరారు. ఇల్లు ఉన్నవాడికే ఇళ్లు అందుతుంది పేదవాడికి ఇల్లు అందకుండా మధ్యలో స్థానిక నాయకులు రాజకీయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ పంచాయితీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com