నెల్లూరు ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండలం, కొత్తపల్లి గ్రామంలో గ్రావెల్ గుంటలో పడి రెండు ఏళ్ళ చిన్నారి అక్షయ మృతి చెందిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున ఆ పాప తల్లిదండ్రులని పరామర్శించి రూ10,000 ఆర్థికసాయం చేయడం జరిగింది. అనంతరం ప్రమాదానికి కారణమయిన అక్రమ గ్రావెల్ గుంటని పరిశీలించడం జరిగింది. ప్రచార ఆర్భాటానికి తప్ప ఏ ఒక్క అంబులెన్సు ఆ బిడ్డ ప్రాణాలు కాపాడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ నుండి వారి స్వగృహానికి తరలించడానికి కూడా ఏ అంబులెన్స్ కానీ మహాప్రస్థానం వాహనం కానీ ప్రభుత్వ హాస్పిటల్ లో సమకూర్చలేదు. ప్రైవేట్ అంబులెన్సుకి ఆర్థిక స్తోమత లేని ఆ బిడ్డ తండ్రి మృతదేహాన్ని ద్విచక్ర వాహనం పైన ఇంటికి తీసుకెళ్లడం నిజంగా చాలా దురదృష్టకరం. పేదవాడి ప్రాణాలకు ఒక భరోసా కల్పించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని, చేతకాని వై సీ పీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలందరికి తెలియచేస్తున్నామని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం చిరంజీవి మండల ప్రధాన కార్యదర్శి సమ్మాన సుకుమార్, మండల ప్రధాన కార్యదర్శి సమ్మాన శివ, మండల కార్యదర్శి సురేష్, మండల కార్యదర్శి నాయుడుపేట తదితరులు పాల్గొన్నారు.