మూడు నెలల క్రితం దొంగల కన్నయ్య వృత్తి రీత్యా చెట్లు నరకడానికి వెళ్ళి దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అతను వెన్నపూస దెబ్బ తిన్నది. గత మూడు నెలల నుండి కుటుంబ సభ్యులు పూట గడవడం కష్టంగా ఉందని తెలుసుకున్న పాపకొల్లు డాక్టర్ ఉపేందర్ గారు కొలిశెట్టి నరేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. నరేష్ గారు స్పందించి ఉగాది పండుగరోజున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించారు. కన్నయ్యకు మొరుగైన వైద్యం అందాలంటే లక్షా యాభై వేల రూపాయలు అవుతుందని అన్నారు. కావున దాతలు ఎవరైనా ఉంటే మంచి మనసుతో స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాసం నాగరాజు, దినేష్, మధు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com