Logo
Date of Publish : 06 May 2021, 3:31 pm
Editor : Sake Naresh

సఖినేటిపల్లి మండలంలో కరోనా రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సిలెండర్లను అందించిన జనసేన నాయకులు

                 సఖినేటిపల్లి సినిమా హాల్ సెంటర్లో చిరుపవన్ సేవాసమితి, జనసేన నాయకుల ఆద్వర్యంలో 5 ఆక్సీజన్ సిలెండర్ లు కొని సఖీనేటిపల్లి ప్రాంత ప్రజలకు ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నారు.  పరిసర ప్రాంత ప్రజలు కోవిడ్ వైరస్తో బాధపడుతూ ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకుంటూ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నవారు ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. అత్యవసరం గలవారికి అందుబాటులో ఉండేవిదంగా ఏర్పాటు చేసి సఖీనేటిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ చేతులమీదుగా ప్రారంభించిన జనసేన నాయకులు.  ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో కరోనా బాధితులకు సరైన ఆక్సిజన్ అందక చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో జనసేన నాయకులు ఈ కార్యక్రమాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు తాలూకా చిరుపవన్ సేవాసమితి అధ్యక్షులు, జనసేన నాయకులు గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు తాడీ మోహన్ కుమార్, జిల్లా చిరంజీవియువత సంయుక్త కార్యదర్శి నామన నాగభూషణం, జనసేన నాయకులు ఉండపల్లి అంజీ, మండేల బాబీనాయుడు, పాటబళ్ళ సూరిబాబు, కూనా నాగేశ్వరావు, తూతిక ఆది,నామన సూర్యనారాయణ, చల్లా రవి, గణి, సాయి, బన్ను జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com