విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ గంజాయి హబ్ గా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్కే బీచ్ వద్ద “సైకిత శిల్పం” ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టిన ధర్మశాల టీం మెంబర్స్. ఈ కార్యక్రమం జనసేన నాయకులు ధర్మేంద్ర, శ్రీకాంత్ మరియు వారి మిత్రబృం ఆధ్వర్యంలో నిర్వహించారు. గంజాయికి యువతలో మరింత అవగాహన పెంచేలా విశాఖ బీచ్ లో కార్యక్రమాలు చేయాలని భావించారు. ఈ కార్యక్రమానికి ముందుగా పోలీసులు అడ్డుకున్న జనసేన నాయకులు అండగా నిలిచిచారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రభుత్వం కళ్లు తెరిచి గంజాయి సాగును ధ్వంసం చేసి గిరిజన యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని జనసేన పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరింత బలగాలను ఇచ్చి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి సాగు మీద మరింత కఠినంగా వ్యవహరించి గిరిజన యువతలో చైతన్యం తేవాలని కోరారు. ప్రజలను మరియు ముఖ్యంగా యువతకు అవగాహన అవగాహన కార్యక్రమాల్లో మేధావులు యువత అందరూ పాల్గొని ఈ గంజాయి మహమ్మారిని విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోరాటం చేయాలని కోరారు. ముక్తకంఠంతో మత్తు వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్, శివ ప్రసాద్, పీలా రామకృష్ణ, పెతకంశెట్టి శ్యామ్, జననేతలు, వీర మహిళలు అమరాపు దుర్గ, కళ తదితర జనసైనికులు పాల్గొన్నారు.