విజయనగరం ( జనస్వరం ) : ఎస్.కోట రెవెన్యూ పరిది సర్వే నంబర్ 82/2 లో భుమికి రొంగలిదేముడు తండ్రి సింహాచలం s/o సోములు పేరుమీదే ఎఫ్ సి ఓ రికార్డులో పేరు నమోదు అయితే దానిని కొట్టివేసి విన్నకోట సత్యనారాయణ తండి పెద్ద జోగారావు పేరు వ్రాసి రికార్డ్ రికార్డ్ టాంపరింగ్ చేసినట్టుగా కనబడుతున్నదని జనసేన నాయకులు అన్నారు. సదరు భూమిపైన రొంగలి దేముడు నాటినుండి నేటి వరకు సాగులో ఉన్నప్పటికీ సదరు భూమి తాము కొన్నామని అంబటి రమేష్ సదరు భూమిని ఆక్రమణలో తీసుకోవాలనే దురుద్దేశంతో స్తంబాలు పాతిపెట్టే ప్రయత్న జరుగుతున్నదని అన్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆక్రమణ ప్రయత్నాన్ని నిరోధించి ఎంక్వయిరీ చేసి సాగు హక్కు తమకు కల్పించాలని కోరుతూ తహశీల్దార్కి, ఎస్.కోట ఎస్. ఐ తరకేశ్వరావు వినతిపత్రం ఇవ్వడము జరిగింది. ఈ కార్యక్రమములో సగు రైతు రొంగలి దేముడు, జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, టీడీపీ మండల కార్యదర్శి జుతడ రమసత్యము, మాజీ ఎంపీటీసీ ఎడారి రమేశ్, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com