పెందుర్తి, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రీ వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ వారి ఆధ్వర్యంలో అక్రమ క్వారీ తవ్వకాలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ నరవలో గ్రావెల్ స్మగ్లింగ్ జరుగుతుంది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలగా మారారని ఎద్దేవా చేశారు. వీటి వల్ల భూగర్భ జలాలు తగ్గుతాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీరు దొరకడం కష్టం అవుతుందని, కొండ ప్రాంతాల నుంచి నీరు చెరువులు చేరకుండా ఈ గుంతలు అడ్డుపడతాయని, జనసేన పార్టీ ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ అక్రమ తవ్వకాలపై గళము వినిపించామని అన్నారు. ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపకపోతే జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటి దొంగల్ని ఈశ్వరుడైన పట్టుకోలేడని మా గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారి సొంత లేఅవుట్లు రోడ్లుకి, వారి వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారని, ఈ విషయంపై ప్రభుత్వ అధికారులకు తెలిపిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అని, దయచేసి మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా భూముల్ని, భవిష్యత్తులో మా ప్రజలు పడబోతున్న సమస్యలపై దృష్టి సారించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోబ్బరి శీను, బొడ్డు నాయుడు, గవరా శ్రీను, ఓమ్మీఅప్పలరాజు, గోపి, ప్రవీణ్, తేజ, శివ, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com