తెలంగాణ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర మరియు కూకట్పల్లి ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. కుకట్పల్లి నియోజకవర్గంలో వీధి కుక్కల దాడిలు అధికమైనాయని అన్నారు. రెండు రోజుల క్రితం కూకట్పల్లి డివిజన్ పరిధిలో ఉన్న దయ్యార్ గూడా రూప సెంటర్లో మయాంక్ అనే 9 ఏళ్ల బాలుడు ఆడుకున్న సమయంలో కుక్కలు దాడి చేసి చేశాయన్నారు. బాలుడి ఎడమచంప, దవడ మరియు చెవి భాగాలను తీవ్రంగా గాయపరిచాయి. గతంలో కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట్ డివిజన్లో-117 ఉన్న యాదవ బస్తీ, కబీర్ నగర్ మరియు ఫతేనగర్ డివిజన్లో-118 ఉన్న భవాని నగర్ ఈ కుక్కల దాడుల వల్ల ప్రజలు ముఖ్యంగా స్త్రీలు మరియు పిల్లలు గాయపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లో వీధి కుక్కలు అధిక సంఖ్యల ఉండటం వల్ల అవి మనుషుల మీద పడి దాడి చేస్తున్నాయని అన్నారు. వీటి పైన చర్యలు తీసుకొని నియోజకవర్గంలో వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరియు సమస్యలను పరిష్కరించవలసిందిగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, నాగేంద్ర, వెంకటేశ్వరరావు, కిషోర్ నాగరాజు, కలిగినీడి ప్రసాద్, రాము, పండు, సూర్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com