బ్రహ్మసముద్రం ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియా, ఇసుక దందా సాగుతోందని కళ్యాణదుర్గం జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోవడంతో, దీని ద్వారా ప్రజలకు, పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. జనసేనపార్టీ అధిష్టానం ఇసుకపై నివేదిక కోరడంతో, జనసేన జిల్లా అధిష్టానం ఆదేశాలతో బ్రహ్మసముద్రం మండలంలోని బుడిమేపల్లి, అజయ్యదొడ్డి రెండు ఇసుక రీచ్ ల్లోని జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా, ఇసుక దందా వీటిపైన పూర్తి నివేదికను తయారుచేసారు. ఈ నివేదికను జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ కు అందజేయడం జరిగిందన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com