అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎర్రంపల్లి ఎంపిటిసి స్థానంలో జనసేన పార్టీ తరుపున చింతలప్ప గారు పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా జిల్లా జనసేన నాయకులు, స్థానిక జనసైనికులు ప్రచారంలో భాగంగా తిప్పాబట్లపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు ప్రచారం నిమిత్తం వచ్చిన జనసేన నాయకులను, జనసైనికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇక్కడికి ప్రచారానికి వస్తే చంపేస్తామని వైసీపీ నాయకులు బెదిరించారు. జనసేన నాయకులని, జనసైనికులని కట్టెలతో దాడి చేయడమే కాకుండా, జెండాలను చించారు. జనసేన నాయకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం నిర్వహించుకోవచ్చని, అది హక్కు అని అన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు అధికార మదంతో ప్రజలను భయభ్రాంతులకి గురి చేయడం అప్రజాస్వామ్యం అన్నారు. భవిష్యత్తులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసే ఆగడాలకు ఖచ్చితంగా శిక్షలు తప్పవని అన్నారు. త్వరలోనే ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు. తదనంతరం జనసేన నాయకులు, జనసైనికులు కలసి కలెక్టర్ గారిని కలసి వినతి పత్రాన్ని అందించారు. ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నాయకుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఈశ్వరయ్య, మారుతి ప్రసాద్, పవనిజం రాజు, హరీష్, ఆదినారాయణ, సంతోష్ దేవన, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com