చంద్రగిరి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, రాయలచెరువు పంచాయితీలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు భాదతో జనసేన మండల అధ్యక్షులు శ్రీ సంజీవి హరికి విన్నవించుకోగా ఇదే విషయం చంద్రగిరి నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా దేవర మనోహర్ మరియు పార్టీ శ్రేణులు ఆ పంచాయితీలో పర్యటించి గ్రామస్థుల దగ్గర నుండి వివరణ తీసుకొని అక్కడ నుండి గ్రామ సచివాలయంకి వెళ్లగా సచివాలయానికి తాళాలు వేయడంతో అక్కడి నుండి పాదయాత్రగా కుప్పంబాధురు సచివాలయానికి చేరుకొని పంచాయితీ సెక్రటరీ గారిని కలిసి డ్రైనేజీ వ్యవస్థ లేకపోయినా, లైబ్రరీ లేకపోయినా వాటి పేరు చెప్పి 237 రూపాయలు వసూలు చేయవలసిన పన్నుని 400 రూపాయలుగా ప్రజల వద్ద నుండి దోచుకుంటారా అని అడిగి, తక్షణమే ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో చూసి తగిన చర్యలు తీసుకోవాలని కోరి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి, జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీ తులసి ప్రసాద్, మండల అధ్యక్షులు శ్రీ సంజీవి హరి, కిరణ్, ఆషా, పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు.